Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ వైసిపి నేతల ఇళ్లలో ఐటీ రైడ్స్...

విజయవాడ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న వంశీరామ్ బిల్డర్స్ సంస్థపై ఇవాళ(మంగళవారం) ఉదయం ఐటీ దాడులు చేపట్టింది. 

First Published Dec 6, 2022, 10:25 AM IST | Last Updated Dec 6, 2022, 10:25 AM IST

విజయవాడ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న వంశీరామ్ బిల్డర్స్ సంస్థపై ఇవాళ(మంగళవారం) ఉదయం ఐటీ దాడులు చేపట్టింది. జూబ్లీ హిల్స్ లోని ఆ సంస్థ ఛైర్మన్ సుబ్బారెడ్డి, డైరెక్టర్ గా వున్న ఆయన బావమరిది జనార్ధన్ రెడ్డి ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయాలు, బంధువుల ఇళ్లలోనూ ఉదయం ఏకకాలంలో ఐటీ రైడ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే విజయవాడలోని ఇద్దరు వైసిపి నేతల ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థతో సంబంధాలను కలిగివున్నారన్న అనుమానాలతో వైసిపి నేతల ఇళ్లలో ఐటీ దాడులు చేపట్టింది.