Asianet News TeluguAsianet News Telugu

ఐటీ దాడులతో భగ్గుమన్న విజయవాడ... దేవినేని అవినాష్ ఇంటివద్ద ఉద్రిక్తత

విజయవాడ : అధికార వైసిపి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

First Published Dec 6, 2022, 2:02 PM IST | Last Updated Dec 6, 2022, 2:02 PM IST

 విజయవాడ : అధికార వైసిపి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయమే కేంద్ర బలగాలతో విజయవాడలోని అవినాష్ ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులతో కూడిన ఐదు బృందాలు సోదాలు ప్రారంభించాయి. ఐటీ దాడుల విషయం తెలుసుకున్న దేవినేని అనుచరులు, స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా ఇంటివద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ నాయకుడిపై ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ అవినాశ్ ఇంటిముందు ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జాం జరిగింది. పోలీసులు అందోళనకారులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.