జనసేన లీడర్ శ్రీనివాసరావుకు ఇప్పటం యువకుల సన్మానం...

గుంటూరు : తమ సమస్యను జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి అండగా నిలిచిన జనసేన చేనేత విబాగం ఛైర్మన్, మంగళగిరి ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావుకు ఇప్పటం గ్రామస్తులు ఆత్మీయంగా సత్కరించారు.

First Published Nov 8, 2022, 12:26 PM IST | Last Updated Nov 8, 2022, 12:26 PM IST

గుంటూరు : తమ సమస్యను జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి అండగా నిలిచిన జనసేన చేనేత విబాగం ఛైర్మన్, మంగళగిరి ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావుకు ఇప్పటం గ్రామస్తులు ఆత్మీయంగా సత్కరించారు. పవన్ ను ఇప్పటం గ్రామానికి తీసుకువచ్చి వైసిపి ప్రభుత్వం కక్షపూరితంగా చేపట్టిన ఇళ్ల కూల్చివేతలను రాష్ట్ర ప్రజల తెలియజేయడంలో శ్రీనివాసరావుది కీలక పాత్ర. దీంతో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు స్పందించి ఇళ్ల కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేసారు. దీంతో తమకు అండగా నిలిచిన జనసేనాని పవన్ తో పాటు శ్రీనివాసరావుకు ఇప్పటం గ్రామ పెద్దలు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు.