ఇప్పటం ఉద్రిక్తత... మహనీయుల విగ్రహాల ధ్వంసంపై పవన్ కామెంట్స్ కు కౌంటర్...

గుంటూరు : నూతనంగా ఏర్పడిన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్లను కూల్చివేత ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.

First Published Nov 6, 2022, 1:54 PM IST | Last Updated Nov 6, 2022, 1:54 PM IST

గుంటూరు : నూతనంగా ఏర్పడిన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్లను కూల్చివేత ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఇళ్లతో పాటు మహాత్మా గాంధీ, జవహార్ లాల్ నుహ్రూ, ఇందిరా గాంధీ, పివి నరసింహారావు వంటి మహామహుల విగ్రహాలను తొలగించారంటూ అక్కడ పర్యటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ విగ్ర‌హాల‌ ధ్వంసం వ్యాఖ్యలపై ఇప్పటం ఇంచార్జి పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ప్ర‌సాద్‌ వివరణ ఇచ్చారు. ఇప్పటం పంచాయితీ కార్యాలయ ప్రహారిగోడ రోడ్డును ఆక్రమించి నిర్మించారని టౌన్ ప్లానింగ్ అధికారుల సమాచారమిచ్చనట్లు పంచాయితీ సెక్రటరీ తెలిపారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రహారి వద్ద ఏర్పాటుచేసిన మహనీయుల విగ్రహాలను తొలగించి జాగ్రత్తగా కార్యాలయంలో పెట్టినట్లు తెలిపారు. జేసిబిలు పెట్టి విగ్రహాలను ధ్వంసం చేసారన్నది అవాస్తమని పంచాయితీ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు.