Asianet News TeluguAsianet News Telugu

రాజ్ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు... రాష్ట్ర ప్రథమ పౌరురాలికి ఆత్మీయ సత్కారం

విజయవాడ: తగిన అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడగలుగుతారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందర్ సతీమణి, రాష్ట్ర ప్రధమ పౌరురాలు సుప్రవ హరిచందన్ అన్నారు. 

విజయవాడ: తగిన అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడగలుగుతారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందర్ సతీమణి, రాష్ట్ర ప్రధమ పౌరురాలు సుప్రవ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్ భవన్ లో సోమవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.  కార్యక్రమానికి రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి నాగమణి అధ్యక్షత వహించగా, ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు సుప్రవ హరిచందన్ బహుమతులు అందచేసారు. కేక్ కట్ చేసి రాజ్ భవన్ మహిళా ఉద్యోగులకు స్వయంగా అందించారు. రాష్ట్ర ప్రధమ పౌరురాలిని రాజ్ భవన్ మహిళా ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.