Asianet News TeluguAsianet News Telugu

భారీగా బంగారం, వెండితో... గుడివాడ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగలముఠా

గుడివాడ : ఉత్తరాది రాష్ట్రం నుండి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ లో దొంగతనాలను పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గుడివాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

First Published Dec 22, 2022, 3:43 PM IST | Last Updated Dec 22, 2022, 3:43 PM IST

గుడివాడ : ఉత్తరాది రాష్ట్రం నుండి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ లో దొంగతనాలను పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గుడివాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ టీచర్స్ కాలనీలో నల్లాన్ చక్రవర్తులు డిసెంబర్ 10న ఓ పెళ్లి కోసం హైదరాబాద్ కు వెళ్లారు. ఇంటికి తాళం వేసి వాచ్ మెన్ ను కాపలాగా వుంచినా మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ దోపిడి ముఠా దొంగతనానికి పాల్పడింది. ఇంట్లోకి చొరబడ్డ నలుగురు దొంగలు దాదాపు 12 లక్షల విలువచేసే బంగారం, వెండి వస్తువులను దొంగిలించారు. ఉదయం ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించిన చక్రవర్తులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఆ ఇంటివద్ద గల సిసి కెమెరాల ఆదారంగా దొంగలను గుర్తించిన పోలీసులు మహారాష్ట్ర బార్డర్లో పట్టుకున్నారు. నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు  గుడివాడ డిఎస్పి సత్యానందం వెల్లడించారు.