దారుణం.. అప్పుడే పుట్టిన శిశువును కాలువలో పడేసిన తల్లిదండ్రులు..
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కేసీ కెనాల్ కాలువలో ఓ పసికందు మృతదేహాం కలకలం రేపింది.
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కేసీ కెనాల్ కాలువలో ఓ పసికందు మృతదేహాం కలకలం రేపింది. పాప చేతికి ఉన్న ట్యాగ్ ఆధారంగా తల్లిదండ్రులను పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెడితే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న మదర్ బి అనే మహిళకు మృత శిశువు జన్మించింది. సిబ్బంది తల్లిదండ్రులకు ఆ మృతదేహాన్ని ఇవ్వగా ఇంటికి తీసుకువెడతామని చెప్పి మార్గమధ్యలో కెనాల్ వేసినట్టుగా విచారణలో తేలింది. తల్లిదండ్రులతోనే అంత్యక్రియలు చేయిస్తామని పోలీసులు చెబుతున్నారు.