Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు జిల్లాలో భారీ వర్షం: బనగానపల్లె జలమయం (వీడియో)

బనగానపల్లె నియోజికవర్గం కొలిమిగుండ్ల, సంజమాల, అవుకు మండలాల్లో లో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి. 

బనగానపల్లె నియోజికవర్గం కొలిమిగుండ్ల, సంజమాల, అవుకు మండలాల్లో లో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి. వాహన దారులు ప్రయాణాలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల కేంద్రం కొలిమిగుండ్ల లో పోలీస్ క్వాటర్స్ రహదారికి దిగువ ప్రాంతం లో ఉండటం వల్ల పోలీస్ క్వాటర్స్ మొత్తం జలమయం తో నిండి పోయి రాత్రంతా  వర్షపు వరద నీరు ఇళ్లలోకి రావటంతో పోలీసులు నిద్రలేకుండా గడిపారు.