video news : ఏడు చెక్పోస్టులు, ఆరు మొబైల్ టీమ్స్ తో అక్రమ రవాణాకు అడ్డుకట్ట
కృష్ణాజిల్లా నందిగామ లో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతుంది.
కృష్ణాజిల్లా నందిగామ లో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతుంది. జొన్నలగడ్డ, అనాసాగరం, కీసర, ప్రాంతాల్లో లారీలను పోలీసులు అదుపులోకితీసుకొని పర్మిషన్లు చెక్ చేయగా పాత వే బిల్ తో కృష్ణాజిల్లాకు తరలించాల్సినఇసుకను పక్క రాష్ట్రమైన తెలంగాణకు తరలిస్తూ పట్టుబడ్డాయి. నందిగామడివిజన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా మొత్తం ఏడు చెక్పోస్టులు,ఆరు మొబైల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామని నందిగామ డిఎస్పీ తెలిపారు.