వరద పోటెత్తినా తగ్గేదేలే... కృష్ణా నది మధ్యలోకెళ్లి ఇసుకను ఎలా సేకరిస్తున్నారో చూడండి...

భారీ వర్షాలతో యావత్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వరద నీటితో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారాయి.

First Published Jul 13, 2022, 2:48 PM IST | Last Updated Jul 13, 2022, 2:48 PM IST

భారీ వర్షాలతో యావత్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వరద నీటితో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారాయి. అయినా మేము మాత్రం తగ్గుదేలే అంటోంది ఇసుక మాఫియా. వరద నీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నప్పటికి ఏమాత్రం భయం లేకుండా కృష్ణా నదిలోకి ఎడ్లబండ్లతో వెళ్లి ఇసుకను యదేచ్చగా తరలిస్తున్నారు. ఇలా కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో మోపిదేవి మండలంలోని కె.కొత్తపాలెం వద్ద కృష్ణా నది మధ్యలోంచి ఇసుకను సేకరిస్తుండగా కొందరు కెమెరా కంటికి చిక్కారు. ఎడ్లబండ్లు, పడవల సాయంతో ఇసుక తవ్వకాలు చేపట్టి నదీగర్భాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు మాత్రం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే చర్యలేవీ చేపట్టడం లేదని వాపోతున్నారు.