Asianet News TeluguAsianet News Telugu

ఒక్కో దానికి ఒక్కో రేటు... పోలీసుల కనుసన్నల్లో మైనింగ్ మాఫియా

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతంలో అక్రమ మైనింగ్ యదేచ్చంగా సాగుతోంది. పోలీసుల కనుసన్నల్లోనే ఈ మాఫియా దందా సాగుతోందని అనడానికి ఇటీవల బయటపడ్డ ఓ ఫోన్ కాల్ రికార్డింగే నిదర్శనం. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండదండలతోనే మైనింగ్ ముఠాలు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. రాత్రుల్లో గుట్టుగా ఇసుక, కంకర, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మట్టికి రూ.1000, కంకర రూ.1500, ఇసుక రూ.2000 (ఎక్కో ట్రాక్టర్ లోడ్ కు) చొప్పున మాఫియా ముఠాలు పోలీసులకు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఇటీవల రాజధాని ప్రాంతంలో యధేచ్చగా మైనింగ్ మాఫియా కార్యకలాపాలు సాగుతున్నాయి. 
 
First Published Aug 12, 2021, 4:50 PM IST | Last Updated Aug 12, 2021, 4:50 PM IST