Asianet News TeluguAsianet News Telugu

పంచాయితీ ఎన్నికల్లో ఏరులై పారుతున్న మద్యం... మైలవరంలో అక్రమ మద్యం పట్టివేత

మైలవరం: రెండు కార్లలో అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మైలవరం పోలీసులు.  

మైలవరం: రెండు కార్లలో అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మైలవరం పోలీసులు.  వాహనాల తనిఖీలో భాగంగా స్థానిక కళాశాల సర్కిల్ లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ అక్రమ మద్యం పట్టుబడింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ వకుల్  జిందాల్ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఎవరైనా మద్యం మరియు డబ్బు అక్రమ రవాణా జరిపిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర  పోషించిన సిబ్బందిని ఆయన అభినందించారు.