ఏపీలో కొత్త జిల్లాల కోలాహలం... బాధ్యతల స్వీకరణలో ఐఎఎస్, ఐపిఎస్ లు బిజీబిజీ

అమరావతి: 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు 26 జిల్లాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుతో పాటు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ వంటి కీలక పోస్టుల్లో అధికారులను కూడా నియమించింది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలో అధికారులు పదవీస్వీకరణలో పాత, కొత్తజిల్లాల్లో కోలాహలం మొదలయ్యింది.  కృష్ణా జిల్లా నూతన కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల మచిలీపట్నం బెల్ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇక ఎన్టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ భాద్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా ఎస్పీగా రవి శంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నరసరావుపేట లోని నూతన ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 

First Published Apr 4, 2022, 9:59 AM IST | Last Updated Apr 4, 2022, 9:59 AM IST