Asianet News TeluguAsianet News Telugu

భార్యాతో గొడవ... పట్టపగలే నడిరోడ్డుపై భర్త ఆత్మహత్యాయత్నం

విజయవాడలో పట్టపగలే బహిరంగంగా అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

First Published Feb 3, 2021, 11:39 AM IST | Last Updated Feb 3, 2021, 11:39 AM IST

విజయవాడలో పట్టపగలే బహిరంగంగా అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నగరంలోని చిట్టినగర్ బస్టాండ్ దగ్గర భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన భర్త పీక కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన అతడిని  అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు టూ టౌన్ పోలీసులు.