Asianet News TeluguAsianet News Telugu

పురుడు పోసుకుని వచ్చిన వివాహితపై భర్త, అత్త దాడి.. ఇంట్లోకి రానివ్వకుండా దారుణం..

జగ్గయ్యపేట : వివాహిత పై భర్త, అత్త దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చోటు చేసుకుంది.

First Published Sep 6, 2022, 11:03 AM IST | Last Updated Sep 6, 2022, 11:03 AM IST

జగ్గయ్యపేట : వివాహిత పై భర్త, అత్త దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చోటు చేసుకుంది. కంభంపాడు గ్రామానికి చెందిన పాటిబండ్ల అనుదీప్ కు తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంకు చెందిన నర్మదతో కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది.కొంతకాలం తర్వాత కాపురంలో కలహాలు వచ్చాయి. పెద్దలు రాజీ కుదిర్చారు. ఆ తరువాత గర్భిణీ కావడంతో నర్మద కాన్పుకు పుట్టింటికి వెళ్లింది. మే నెలలో నర్మద తండ్రి పాటిబండ్ల శ్రీనివాసరావుపై అనుదీప్ దాడి చేశాడు. దాడి తర్వాత శ్రీనివాసరావు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ జోక్యం చేసుకోవడంతో పోలీసులు అనుదీప్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. 

గత నెలలో విడుదలై అనుదీప్ ఇంటికి వచ్చాడు. కాన్పుకు పుట్టింటికి వెళ్లిన నర్మద చంటి బిడ్డతో సోమవారం భర్త ఇంటికి వచ్చింది. ఇంట్లోకి రానివ్వకుండా నర్మద పై భర్త, అత్త రేణుక దుర్భాషలాడుతూ దాడి చేశారు.దీంతో బాధితురాలు ఇంటి ముందు చంటి బిడ్డతో ఆందోళనకు దిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి, నర్మద ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్త పై కేసు నమోదు చేశారు.