Asianet News TeluguAsianet News Telugu

గర్బిణి భార్యకు హెచ్ఐవి ఇంజక్షన్... తాడేపల్లిలో కసాయి భర్త అమానుషం

తాడేపల్లి : కట్టుకున్న భార్య అన్న ప్రేమ లేదు... 

First Published Dec 15, 2022, 4:01 PM IST | Last Updated Dec 15, 2022, 4:01 PM IST

తాడేపల్లి : కట్టుకున్న భార్య అన్న ప్రేమ లేదు... గర్భిణి మహిళ అనే జాలి కూడా లేకుండా కసాయి భర్త తన జీవితాన్ని నాశనం చేసాడని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వివాహిత ఆందోళనకు దిగింది. మరో యువతి మోజులో పడ్డ భర్త తనను వదిలించుకోడానికి దారుణానికి ఒడిగట్టాడని... ఆర్ఎంపి డాక్టర్ సాయంతో తనకు హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చాడని బాధితురాలు తెలిపారు. భర్త నిర్వాకంతో తానిప్పుడు ఎయిడ్స్ తో బాధపడుతున్నానని బాధితురాలు వాపోయారు. తన జీవితంతో ఆటాడుకున్న భర్తను కఠినంగా శిక్షించాలంటూ బాధిత మహిళ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కసాయి భర్తను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.