త్వరలో పదో తరగతికి పరీక్షల షెడ్యూల్ విడుదల : ఆదిమూలపు సురేష్
అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తరపున విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆన్ లైన్, డిజిటల్ తరగతులు మరింతగా వాడాలని కేంద్రమంత్రి సూచించారు. విద్యాసంవత్సరంలోనే కాకుండా వేసవిలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేశామని కేంద్రమంత్రికి తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షల నిర్వహిస్తామని, త్వరలోనే పదో తరగతికి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.