అయ్యప్ప భక్తులపై ఉత్తరాది దౌర్జన్యం... తాడేపల్లిలో నిలిచిన హౌరా-కొచ్చి ఎక్స్ ప్రెస్
తాడేపల్లి : ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల ప్రయాణికుల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో హౌరా-కొచ్చి ఎక్స్ ప్రెస్ తాడేపల్లిలో అరగంటపాటు నిలిచిపోయింది.
తాడేపల్లి : ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల ప్రయాణికుల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో హౌరా-కొచ్చి ఎక్స్ ప్రెస్ తాడేపల్లిలో అరగంటపాటు నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప మాలదారులు, భక్తులు శబరిమల వెళ్లేందుకు ఈ రైల్లో రిజర్వేషన్లు చేయించుకున్నారు. అయితే ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే అయ్యప్పభక్తుల బెర్తుల్లో ఉత్తరాదికి చెందిన కొందరు కూర్చున్నారు. దీంతో తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద అయ్యప్ప భక్తులకు, ఉత్తరాది రాష్ట్రాల ప్రయాణికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అయ్యప్ప భక్తులు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును అరగంటపాటు అక్కడే నిలిపి అక్రమంగా ప్రయాణిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రయాణికులు దించేసారు. రైల్వే అధికారులు, పోలీసులు కూడా రంగప్రవేశం చేసి రిజర్వేషన్ కలిగివున్న అయ్యప్ప భక్తులకు సీట్లను కేటాయించారు. ఇలా అరగంట తర్వాత రైలు తిరిగి బయలుదేరింది.