కరోనావైరస్ కు హోమియో మందులు.. మూడు కోట్ల మందికి పంపిణీ..

ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ కరోనా వైరస్ భారీ నుండి బయటపడేందుకు ఆర్సీనిక్ ఆల్బా 30 అనే హోమియో మెడిసిన్ ను ఆయుష్ డిపార్ట్మెంట్ తయారు చేసింది. 

First Published Apr 23, 2020, 1:55 PM IST | Last Updated Apr 23, 2020, 1:55 PM IST

ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ కరోనా వైరస్ భారీ నుండి బయటపడేందుకు ఆర్సీనిక్ ఆల్బా 30 అనే హోమియో మెడిసిన్ ను ఆయుష్ డిపార్ట్మెంట్ తయారు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ప్రజలకు ఈ మెడిసిన్ అందేలా చర్యలు చేపట్టారు. ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఉషా కుమారి ఆదేశాల మేరకు ఇప్పటికే రెడ్ జోన్ ప్రాంతాల్లో హోమియో మెడిసిన్ ను పంపిణీ చేశారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లా నోడల్ ఆఫీసర్ బాబు బాలాజీ ప్రకాశ్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యబాబు, డాక్టర్ రాగలత లు హోంమంత్రి సుచరితని కలిసి హోమియో మందులను అందించారు. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి హోమియో మందులను పంపిణీ చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.