దెందులూరులో 144 సెక్షన్... స్వయంగా రంగంలోకి దిగిన ఏలూరు ఎస్పీ

ఏలూరు జిల్లా దెందులూరులో అర్థరాత్రి చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

First Published Jun 8, 2022, 3:56 PM IST | Last Updated Jun 8, 2022, 3:56 PM IST

ఏలూరు జిల్లా దెందులూరులో అర్థరాత్రి చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు చర్యలు చేపట్టారు. స్వయంగా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు దెందులూరులో పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఏలూరు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే దెందులూరులో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగే రాత్రి జరిగిన అల్లర్లకు బాధ్యులను కనిపెట్టే పనిని స్పెషల్ టీం చేపడుతోంది. ఇక పక్కనే వున్న కృష్ణా జిల్లా నుంచి ఏలూరుకు అదనపు బలగాలను తీసుకువచ్చి బందోబస్తు చేపట్టారు. దెందులూరు గ్రామ పరిధిలో పికెట్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. అనుమానితులు ఎవరు గ్రామంలో ప్రవేశించకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.