తెనాలిలో టీడీపీ అన్నా క్యాంటీన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..

గుంటూరు జిల్లా : తెనాలిలో తెదేపా అన్నా క్యాంటిన్ వద్ద పోలీసుల భారీగా మొహరించారు.

First Published Sep 3, 2022, 12:20 PM IST | Last Updated Sep 3, 2022, 12:20 PM IST

గుంటూరు జిల్లా : తెనాలిలో తెదేపా అన్నా క్యాంటిన్ వద్ద పోలీసుల భారీగా మొహరించారు. మార్కెట్ వైపు వెళ్లే నాలుగు మార్గాలు బ్యారిగేడ్లతో మూసివేశారు. మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గత నెల 12న అన్నా క్యాంటిన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.  క్యాంటిన్ మూసేయాలని రెండు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని మున్సిపల్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఐదు రోజుల క్రితం క్యాంటిన్ ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం మున్సిపల్ అధికారులు టెంట్ తొలగించారు. అయితే  ఇవాళ కూడా ఆహారం పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసుల మొహరించారు. దీంతో మార్కెట్ సెంటర్లో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది.