Asianet News TeluguAsianet News Telugu

పల్నాడులో ఉద్రిక్తత... మాజీ మంత్రి ఆనంద్ బాబు ఇంటివద్ద భారీగా పోలీసుల మొహరింపు

గుంటూరు : ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేసారు. 

First Published Dec 23, 2022, 11:10 AM IST | Last Updated Dec 23, 2022, 11:10 AM IST

గుంటూరు : ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేసారు. నరసరావుపేటలో టిడిపి నేత హత్య, మాచర్ల ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ  క్రమంలోనే టిడిపి నాయకులు పల్నాడు జిల్లా పర్యటనకు సిద్దమవగా ఆంక్షలు విధించిన పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇలా గుంటూరులోని వసంతరాయపురం కాలనీలోని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అయితే పోలీసుల రాకకు ముందే ఆనంద్ బాబు బయటకు వెళ్లిపోయారు.