ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద... పరివాహక ప్రాంత ప్రజల ఆందోళన... అధికారులు అలర్డ్
అమరావతి : పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరదనీర చేరడంతో కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
అమరావతి : పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరదనీర చేరడంతో కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చడంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండి భారీగా నీరు సముద్రంలో కలుస్తోంది. పులిచింతల ప్రాజెక్ట్ నుండి 3.74 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ నుండి 70 గేట్లెత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతుండంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణా నది పరిసరాలకు గానీ, ప్రకాశం బ్యారేజీ వద్దకు గానీ ఎట్టిపరిస్థితుల్లో వెళ్లవద్దని... లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని మైకుల ద్వారా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు హెచ్చరిస్తున్నారు.