భారీ వర్షాలతో ఉప్పొంగిన కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
విజయవాడ : ఇరు తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు.
విజయవాడ : ఇరు తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. ఇలా కృష్ణానది కూడా భారీ వరద నీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజిలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. వరద ఉధృతి ఎక్కువగా వుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరక జారీ చేసారు. బ్యారేజీకి వచ్చిన నీటిన వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. ఇలా 4.25లక్షల క్యూసెక్కులు నీటిని కిందకు వదిలుతూ ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాదకరంగా నీటిప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.