మళ్ళీ మొదలైన కాల్ మనీ వేధింపులు..డబ్బులు చెల్లించినా, అధిక వడ్డీకోసం బెదిరింపులు...

కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ కాల్ మనీ వేధింపులు మొదలయ్యాయి.

First Published Sep 7, 2022, 9:59 AM IST | Last Updated Sep 7, 2022, 9:59 AM IST

కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ కాల్ మనీ వేధింపులు మొదలయ్యాయి. గన్నవరం మండలం మాధలవారి గూడెంలో ఇటుకబట్టి నడుపుతున్న ఓ వ్యాపారి కొల్లా వెంకట రత్నం దగ్గర 25 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి చెల్లించినా.. అధిక వడ్డీ రేట్లు వేసి ఇంకా డబ్బులు కట్టాలని వేదిస్తున్నాడని ఇటుకబట్టి యజమాని కన్నీరు మున్నీరు అవుతున్నాడు. కొల్లా వెంకటరత్నం,   అతని తమ్ముడు కలిసి వ్యాపారిని రైలు పట్టాలు వద్దకు లాక్కెళ్లి, బెదిరింపులకు గురిచేసి.. అధిక సొమ్ము ఇవ్వాలని నోటు రాపించుకున్నారు. నిన్న ఇటుకబట్టి దగ్గరకి వచ్చి  సి.సి.కెమెరాలు, బాక్సులు పగలు కొట్టి, పడుకొని ఉన్న తన భర్తను బయటకు లాక్కొచ్చి ఇటుక రాయితో తల పగలు కొట్టారు అని వ్యాపారి భార్య మద్దినేని మల్లీశ్వరి చెప్పారు. ఈ దాడిలో వెంకట రత్నం, అతని కుటుంబ సభ్యులు,  బయట వ్యక్తులు ఉన్నారని అమె తెలిపింది. దీంతో ఇటుకబట్టి యజమాని గన్నవరం పోలీసులు ఆశ్రయించాడు.