Asianet News TeluguAsianet News Telugu

టిడిపి మాజీ ఎమ్మెల్యే భవనం కూల్చివేత... గాజువాకలో ఉద్రిక్తత

విశాఖపట్నంలో మరో టిడిపి నేతకు చెందిన భవనాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జివిఎంసి) అధికారాలు తెల్లవారుజామున గంటలు నుండి కుల్చివేత చేపట్టారు.

విశాఖపట్నంలో మరో టిడిపి నేతకు చెందిన భవనాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జివిఎంసి) అధికారాలు తెల్లవారుజామున గంటలు నుండి కుల్చివేత చేపట్టారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎కి చెందిన బిల్డింగ్‎ను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. గాజువాకలోని ఈ బిల్డింగ్ ను నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారంటూ జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. 

విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పల్లా శ్రీనివాసరావు  నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఎలా కూల్చివేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ కూల్చివేతలు  కక్ష సాధింపుచర్యల్లో భాగమేనని ఆరోపించారు.  దీనిపై సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయకుండా భారీగా పోలీసులు మోహరించారు.