AP News:ఒకేసారి 40మంది బాలికల అస్వస్థత... హుటాహుటిన గుడివాడ దవాఖానకు తరలింపు

గుడివాడ: కృష్ణా జల్లా గుడివాడ మండల పరిధిలోని మోటూరు గురుకుల బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురవడం తీవ్ర కలకలం రేపింది. 

First Published Apr 8, 2022, 3:53 PM IST | Last Updated Apr 8, 2022, 3:53 PM IST

గుడివాడ: కృష్ణా జల్లా గుడివాడ మండల పరిధిలోని మోటూరు గురుకుల బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురవడం తీవ్ర కలకలం రేపింది. గురువారం సాయంత్రం పాఠశాల గ్రౌండ్ లో పరుగుపందెంలో పాల్గొన్న విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయి ఒక్కొక్కరుగా కుప్పకూలారు. ఇలా దాదాపు 40మంది అస్వస్థతకు గురవగా వీరిలో తొమ్మిదిమంది బాలికల పరిస్థితి ఆందోళనకరంగా వుండటంతో గుడివాడ  ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. డీహైడ్రేషన్ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు చెబుతుంటే హాస్టల్లో పెట్టిన ఆహారం వల్లే తమ పిల్లలకు అనారోగ్యం పాలయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.