గుంటూరులో కిడ్నాప్ కలకలం... రంగనాయక స్వామి ఆలయ ధర్మకర్తను నడిరోడ్డుపై చితకబాదిన కార్పోరేటర్ భర్త
అమరావతి: అధికార వైసిపి కార్పోరేటర్ భర్త తన అనుచరులతో కలిసి పట్టపగలే ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడం గుంటూరు పట్టణంలో కలకలం రేపింది.
అమరావతి: అధికార వైసిపి కార్పోరేటర్ భర్త తన అనుచరులతో కలిసి పట్టపగలే ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడం గుంటూరు పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని శ్రీ మోహన రంగనాయక స్వామి ఆలయం ధర్మకర్త రాచపూడి సుబ్బరాజును నడిరోడ్డుపై కిరాతకంగా చితకబాదుతూ కిడ్నాప్ కు ప్రయత్నించాడు కార్పోరేటర్ భర్త. అరండల్ పేట గ్రంథాలయ సెంటర్లో అందరూ చూస్తుండగా 49వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి భర్త కిషోర్ కుమార్ తన అనుచరులతో వచ్చి వైసిపికే చెందిన సుబ్బరాజు పై విచక్షణ రహితంగా దాడి చేసాడు. అంతటితో ఆగకుండా సుబ్బరాజును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. కానీ స్థానికులు కార్పోరేటర్ భర్తను అడ్డుకుని అతన్ని కాపాడారు. కార్పోరేటర్ భర్త కిషోర్, అతడి అనుచరులను స్థానికులు పోలీసులకు అప్పగించారు.