కృష్ణా నదిలో వినాయక నిమజ్జనాలు... ఉదృతంగా ప్రవహం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
గుంటూరు : వినాయక చవితి పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా గుంటూరు పోలీసులు చర్యలు చేపట్టారు.
గుంటూరు : వినాయక చవితి పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా గుంటూరు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నదులు ప్రమాదకరరీతిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో నిమజ్జనం సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో భారీగా విగ్రహాలను నిమజ్జనం చేసే సీతానగరం వద్ద కృష్ణా నది పుష్కర ఘాట్లను ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్ ఇతర సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం తరలించే సమయంలో ప్రశాతంగా ఊరేగింపు జరుపుకోవాలన్నారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాల నుండి వందల సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం వుండటంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. కృష్ణా నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,ముందస్తు భద్రతా చర్యలు తదితర అంశాలపై స్థానిక పోలీసులకు ఎస్పీ తగు సూచనలు చేసారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో పొరపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఆదేశించారు