అత్యాచారం కాదు వివాహేతర సంబంధమే... తుమ్మపూడి వివాహిత హత్యకేసులో కొత్త ట్విస్ట్

అమరావతి: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో సంచలనం సృష్టించిన మహిళ హత్యకేసు మరో మలుపు తిరిగింది. 

First Published Apr 28, 2022, 11:06 PM IST | Last Updated Apr 28, 2022, 11:06 PM IST

అమరావతి: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో సంచలనం సృష్టించిన మహిళ హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు ప్రచారం జరిగినట్లు మహిళపై అత్యాచారం జరగలేదని...ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. మృతురాలికి వెంకటసాయి సతీష్ తో వివాహేతర సంబంధం వుందని తెలిసిందన్నారు. అయితే బుధవారం సతీష్ స్నేహితుడు శివసత్య సాయిరాంతో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడని... తన కోరిక తీర్చాలని సాయిరాం వేధించాడని తెలిపారు. ఇందుకు మహిళ ఒప్పుకోకపోగా ఈ విషయం అందరికీ చెబుతానని బెదిరించడంతో ఆమె చీరను మెడకు బిగించి శివసత్య సాయిరాం హతమార్చినట్లు ఎస్పీ వివరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.