Asianet News TeluguAsianet News Telugu
breaking news image

కేసీఆర్ రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలకు మద్దతు... ఎస్సై వీడియోపై గుంటూరు పోలీసుల క్లారిటీ

గుంటూరు: రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు మద్దతిస్తూ పోలీస్ యూనిఫాంలో వున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది.

గుంటూరు: రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు మద్దతిస్తూ పోలీస్ యూనిఫాంలో వున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. అయితే సదరు వీడియోలో ఎస్సై యూనిఫార్మ్ లో ఉన్న శివ అనే వ్యక్తికి చిలకలూరిపేట పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని గుంటూరు రూరల్ పోలీసులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ వ్యక్తి చిలకలూరిపేటలో మాత్రమే కాదు గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ శాఖలో ఎక్కడా కూడా పని చేయడం లేదని తెలిపారు.

ఈ విడియోకి సంబంధించి నిజానిజాలను నిర్దారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. వీడియోలోని వ్యక్తి గురించి తెలిస్తే చిలకలూరిపేట పోలీసులకు సమాచారం ఇవ్వాలని...  వారు వెంటనే చర్యలు తీసుకుంటారని గుంటూరు రూరల్ పోలీసులు తెలిపారు.