Asianet News TeluguAsianet News Telugu

షాక్.. పాత గోడ కూలి.. ఆ యజమానికి ఏం దొరికాయంటే..

కర్నూలు జిల్లా, రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో గోడకూలి బైటపడ్డ ఓ తుపాకీ, తూటాలు కలకలం రేపాయి.

కర్నూలు జిల్లా, రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో గోడకూలి బైటపడ్డ ఓ తుపాకీ, తూటాలు కలకలం రేపాయి. సుబ్బారాయుడు అనే వ్యక్తికి చెందిన ఇంట్లోని గోడలో ఈ తుపాకీ, తూటాలు దొరికాయి. పూర్వీకుల నుండి అక్కడే ఉంటున్నామని సుబ్బారాయుడు తెలిపారు. ఇల్లు శిథిలావస్తకు చేరుకోగా, ఇటీవలి వర్షాలకు మరింతగా నాని ఓ గోడ కూలిపోయింది. కూలిన గోడలో ఓ తుపాకి, 12 తూటాలు బయటపడ్డాయి. వెంటనే సుబ్బారాయుడు పోలీసులకు సమాచారం అందించాడు.  తుపాకి, తూటాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.