సాయం చేయకున్నా సరే... కానీ అవమానించకు..: కొడాలి నానిపై గుడివాడ రైతుల ఆగ్రహం

గుడివాడ : ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు మునిగి తీవ్రంగా నష్టపోయామని కృష్ణా జిల్లా గుడివాడ రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. 

First Published Aug 16, 2023, 5:49 PM IST | Last Updated Aug 16, 2023, 5:49 PM IST


గుడివాడ : ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు మునిగి తీవ్రంగా నష్టపోయామని కృష్ణా జిల్లా గుడివాడ రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం తన నియోజకవర్గంలో పంటలేమీ మునకకు గురికాలేవని... రైతులెవ్వరూ నష్టపోలేదని అనడం దారుణమని అన్నారు. నష్టపోయిన తమకు సహాయం చేయకున్నా పర్వాలేదు... కానీ ఇలా అవమానించేలా మాట్లాడొద్దని తమ ఎమ్మెల్యేకు రైతుల విజ్ఞప్తి చేసారు. టిడిపి నేత వెనిగాండ్ల రాము నష్టపోయిన రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు.