జగన్ సభకోసం పంట వేయొద్దంటున్నారు...: గుడివాడ కౌలురైతు ఆవేదన
గుడివాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21న చేపట్టనున్న టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం తమకు నష్టాలను మిగిలించేలా వుందని కృష్ణా జిల్లా గుడివాడ రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.
గుడివాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21న చేపట్టనున్న టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం తమకు నష్టాలను మిగిలించేలా వుందని కృష్ణా జిల్లా గుడివాడ రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. తమ భూముల్లో సీఎం సభ ఏర్పాట్లు చేస్తున్నారని... అందుకోసం తాము పంటలు వేయవద్దని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఆదేశించారని కౌలు రైతు నాగరాజు తెలిపారు. ఇలా మొత్తం 14 ఎకరాల్లో సీఎం సభ కోసం పంటలు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని... దీంతో ఎకరాకు రూ.30వేలు నష్టపోతున్నామని రైతు అన్నారు. నష్టపరిహారం చెల్లించాకే సీఎం సభ జరుపుకోవాలని రైతు నాగరాజు డిమాండ్ చేసారు.
''జగనన్న... రైతుల్ని ఇంతగా ఎందుకు బాధపెడుతున్నావన్నా. ఈ బాధలు మాకు ఎందుకన్నా. వడ్లు కోసి పదిరోజులయినా ఎవ్వరూ కొనడంలేదు. నాణ్యత లేదంటూ వేరే మిల్లుకు తరలించమని చెబుతున్నారు. ధాన్యం రోడ్డుపై ఆరబెట్టినా సంచులు ఇవ్వలేదు. రైతులకు ఇంకేం చేసావు జగనన్న'' అంటూ కౌలు రైతు నాగరాజు నిలదీసాడు.