ఛలో గుడివాడ ఉద్రిక్తం... ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు అరెస్ట్

గుడివాడ: సంక్రాంతి పండగ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఫంక్షన్ హాల్ లో క్యాసినో నిర్వహించారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుడివాడలో పరిస్థితులకు తెలుసుకునేందుకు బిజెపి ఛలో గుడివాడ కార్యక్రమాన్ని చేప్పటింది. ఇందులో భాగంగా గుడివాడకు వెళుతున్న బిజెపి నాయకులకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహానికి గురయి భారీకేడ్లను తోసుకుని ముందుకు వెళ్లారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజుతో పాటు నాయకులు సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసారు. 

First Published Jan 25, 2022, 4:58 PM IST | Last Updated Jan 25, 2022, 5:30 PM IST