పూల వర్షం, శాలువాలు, మాలలు, అభిమానుల సందడి... విశాఖలో మంత్రి ధర్మానకు ఘన స్వాగతం
విశాఖపట్నం: రెవెన్యూ మంత్రిగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అనుచరులు, జిల్లా వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
విశాఖపట్నం: రెవెన్యూ మంత్రిగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అనుచరులు, జిల్లా వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి బయటకు రాగానే పూలవర్షం కురిపించారు. అనంతరం నాయకులు బొకేలు, శాలువాలు, పూల మాలలతో ఆయనకు సత్కరించి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన సర్కిట్ హౌస్ కు వెళ్ళారు మంత్రి ధర్మాన.