Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో సతీసమేతంగా ఓటేసిన గవర్నర్ బిశ్వభూషణ్

Mar 10, 2021, 5:30 PM IST

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లోని మున్సిపాటీలు, కార్పోరేషన్లలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే ఇవాళ(బుధవారం) పోలింగ్ జరుగుతుండగా విజయవాడ కార్పోరేషన్ పరిధిలో గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాజ్ భవన్ సమీపంలోని చుండూరి వెంకట రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు దంపతులిద్దరు వేశారు. రాష్ట్ర ప్రథమ పౌరులమయిన తాము బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్నామని... ప్రతి ఒక్కరూ ఓటెయ్యాలని గవర్నర్ బిశ్వభూషణ్ పిలుపునిచ్చారు.