మందుబాబుల చేతివాటం.. ప్రభుత్వ వైన్ షాప్ కే కన్నం..
విశాఖ జిల్లా చోడవరంలో లాక్ డౌన్ తో ప్రభుత్వ మద్యం షాపులు బంద్ చేసినా, ప్రభుత్వ మద్యం దొడ్డిదారిన వస్తుందన్న ఆరోపణలతో.. చోడవరం వెంకటేశ్వర ఆర్చ్ దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైన్ షాప్ చెక్ చేయగా, 7 లక్షల 76 వేల 380 రూపాయలు షార్టేజ్ రావడంతో పోలీసులు కంగు తిన్నారు.
విశాఖ జిల్లా చోడవరంలో లాక్ డౌన్ తో ప్రభుత్వ మద్యం షాపులు బంద్ చేసినా, ప్రభుత్వ మద్యం దొడ్డిదారిన వస్తుందన్న ఆరోపణలతో.. చోడవరం వెంకటేశ్వర ఆర్చ్ దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైన్ షాప్ చెక్ చేయగా, 7 లక్షల 76 వేల 380 రూపాయలు షార్టేజ్ రావడంతో పోలీసులు కంగు తిన్నారు. మద్యం షాపు లో పనిచేసే సూపర్వైజర్ బి కరుణ, సేల్స్ మాన్ నాగేంద్ర కుమార్, అల్లాడి శివకృష్ణ లు కలిపి ఈ దొంగతనానికి పాల్పడి నట్లు.. ఈ డబ్బును వాళ్ల నుండి రికవరీ చేసి, కేసు నమోదు చేసినట్లు చోడవరం ఎక్సైజ్ సిఐ తెలిపారు. లాక్ డౌన్ కి ముందు భారీగా మద్యం పక్కదారి చేసి, దొంగ దారిన ఎక్కువ రేటుకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.