పాముకాటుతో వెళితే ప్రాణాలతో చెలగాటం... తిరువూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది వైద్యం కోసం వెళితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 

First Published Aug 30, 2022, 1:55 PM IST | Last Updated Aug 30, 2022, 1:55 PM IST

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది వైద్యం కోసం వెళితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సీరియస్ కండిషన్ లో వచ్చినవారికి కూడా వైద్యం చేయడానికి  డాక్టర్లు లేరంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు తెలిపారు. ఇలా పాముకాటుతో వచ్చిన ఓ ఆర్టిసి డ్రైవర్ తోనూ ఇలాగే హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి వైద్యం అందించకుండా ప్రాణాలతో చెలగాటం ఆడారు. తిరువూరు డిపోలోనే ఆర్టిసి డ్రైవర్ గా పనిచేసే కిశోర్ కుమార్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతుండగా పాముకాటుకు గురయ్యాడు. దీంతో అతడిని తోటి కార్మికులు, కుటుంబసభ్యులు తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అతడి ప్రాణాలను కాపాడేందుకు వెంటనే వైద్యం అందించడమో, ప్రథమ చికిత్స చేయకుండా డాక్టర్లు లేరంటూ సిబ్బంది చేతులెత్తేసారు. అత్యవసర వైద్యంకోసం  విజయవాడ వెళ్లాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ కుటుంబం నరకయాతన అనుభవించింది.