రాపిడ్ టెస్టు కిట్లు ఎందుకూ పనికిరావు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి
లాక్ డౌన్ కారణంగా లక్షలాదిమంది అంసంఘటిత కార్మికులు రోడ్డున పడ్డారు.
లాక్ డౌన్ కారణంగా లక్షలాదిమంది అంసంఘటిత కార్మికులు రోడ్డున పడ్డారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఇవేమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. భవన కార్మికుల నిధి కింద 52 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటి నుంచి 32 వేల కోట్ల రూపాయలు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులకు ఖర్చు చేయమని కేంద్రం చెబుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం అందులోనుంచి ఒక్క రూపాయి కూడా బయటకు తీయడం లేదు. కార్మికులకు దాతలు మాత్రమే సాయం చేస్తున్నారు. ఈ వయసులో బయటకు తిరగొద్దని వైద్యులు చెబితే ఇంటికే పరిమితమయ్యా. మీ సాక్షిలో ఎమ్మెల్యే గోరంట్ల మిస్సింగ్ అని రాస్తారు..ఏంటి ఈ ప్రభుత్వ వ్యవహారం? సిగ్గుందా మీకు? తప్పుడు వార్తలు సరికాదు.