కర్నూలులో పట్టాలు తప్పిన గూడ్సు రైలు..

కర్నూలు జిల్లాలో ఈరోజు గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని మల్యాల మండలం లింగనేనిదొడ్డి గ్రామం వద్ద సంఘటన జరిగింది. 

First Published Jul 3, 2020, 2:49 PM IST | Last Updated Jul 3, 2020, 2:55 PM IST

కర్నూలు జిల్లాలో ఈరోజు గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని మల్యాల మండలం లింగనేనిదొడ్డి గ్రామం వద్ద సంఘటన జరిగింది. తెలంగాణలోని  నిజామాబాద్‌ నుంచి సేలంకు బియ్యం లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలు లింగనేనిదొడ్డి గ్రామం మలుపు వద్ద పట్టాలు తప్పింది. దీంతో గూడ్స్‌లోని 6వ వ్యాగన్‌ పట్టాల నుంచి పక్కకు ఒరిగింది  రైలు డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో మరిన్ని బోగీలు పట్టాలు తప్పకుండా కాపాడారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.