నరసరావుపేట సబ్ కలెక్టరేట్ ముట్టడి... రీపోలింగ్ కు డిమాండ్
Apr 8, 2021, 9:12 PM IST
గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని గోనెపూడి, పాలపాడు గ్రామస్తులు ముట్టడించారు. తమ గ్రామాల్లో అధికారులు, పోలీసులను ఉపయోగించుకుని వైసిపి అక్రమాలకు పాల్పడిందని... వెంటనే రీపోలింగ్ జరపాలని గ్రామస్తుల డిమాండ్ చేశారు. అలాగే నరసరావుపేట టూటౌన్ సిఐ కృష్ణయ్యని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు నినాదాలు చేశారు.