Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరిలో ఘరానా మోసం... యజమానిని మాటల్లోపెట్టి రూ.19లక్షల బంగారం చోరీ

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో దొంగతనం జరిగింది. షరాబ్ బజార్ లో కొల్లి గిరి అనే వ్యక్తి నగల తయారీ వ్యాపారం చేస్తుంటాడు. అతడి షాప్ గతంలో నరేంద్ర అనే యువకుడు పనిచేసి మానేసాడు. తాజాగా పాతపరిచయంతో షాప్ కు వచ్చిన నరేంద్ర యజమాని గిరిని మాటల్లో పెట్టి 375 గ్రాములు విలువ చేసే బంగారు తీగను ఎత్తుకెళ్లాడు. అయితే బంగారం పోయినట్లు గుర్తించిన గిరి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. చోరీకి గురయిన బంగారం విలువ రూ.19లక్షలుగా వుంటుందని తెలుస్తోంది. 
 
First Published Apr 5, 2022, 11:13 AM IST | Last Updated Apr 5, 2022, 11:13 AM IST