పొలంలో దొరికిన బంగారు నాణేల కుండ... ఆ రైతు ఏం చేసాడంటే..!

ఏలూరు : ఓ  రైతు పొలంలో పైపులైన్ కోసం తవ్వుతుండగా పురాతన బంగారు నాణేలు లభించాయి.

First Published Dec 5, 2022, 5:04 PM IST | Last Updated Dec 5, 2022, 5:04 PM IST

ఏలూరు : ఓ  రైతు పొలంలో పైపులైన్ కోసం తవ్వుతుండగా పురాతన బంగారు నాణేలు లభించాయి. అయితే ఈ విషయం ప్రభుత్వానికి తెలియడంతో అధికారులు ఈ మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకుని ట్రెజరీ శాఖకు అప్పగించారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.  

కొయ్యగూడెం మండలం  ఏడువాడలపాలెం గ్రామ పరిధిలో మానుకొండ తేజస్వి-సత్యనారాయణ దంపతులు తమ పొలంలొ ఆయిల్ ఫాం తోటలు వేసారు. వీటికి నీటిసరఫరా కోసం పైప్ లైన్ వేయడానికి తవ్విస్తుండగా ఓ చిన్న కుండ లభించింది. అది తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు వున్నాయి. దీంతో సత్యనారాయణ స్థానిక  తహసీల్దార్ కు సమాచరమివ్వగా అధికారులు వెళ్లి బంగారు నాణేలను స్వాధీనం చేసుకుని ట్రెజరీ శాఖకు పంపించారు.