శ్రీకాకుళంలో భయం భయం... నడిరోడ్డుపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా
శ్రీకాకుళం : ప్రమాదకరమైన గ్యాస్ లోడ్ తో వెళుతున్న భారీ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం : ప్రమాదకరమైన గ్యాస్ లోడ్ తో వెళుతున్న భారీ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ట్యాంకర్ లో గ్యాస్ వుండటంతో ప్రమాద స్థలానికి సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విశాఖపట్నం నుండి జార్ఖండ్ రాజధాని రాంచీకి గ్యాస్ లోడ్ తో ఓ ట్యాంకర్ బయలుదేరింది. అయితే మార్గమధ్యలో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్ద బాణాపురం సమీపంలో జాతీయ రహదారిపై వెళుతూ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ లో ప్రమాదకర గ్యాస్ వుండటంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గర్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది ఎలాంటి ప్రమాదం జరక్కముందే ట్యాంకర్ ను అక్కడి నుండి తరలించారు. దీంతో స్థానికుల్లో భయాందోళన తగ్గింది.