Asianet News TeluguAsianet News Telugu

విశాఖ శివారులో గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా... తప్పిన పెనుప్రమాదం

విశాఖపట్నం : జనావాసాల మధ్యలో గ్యాస్ సిలిండర్ల లారీ ప్రమాదానికి గురయిన ఘటన విశాఖపట్నం శివారులో చోటుచేసుకుంది. 

First Published Dec 14, 2022, 10:24 AM IST | Last Updated Dec 14, 2022, 10:24 AM IST

విశాఖపట్నం : జనావాసాల మధ్యలో గ్యాస్ సిలిండర్ల లారీ ప్రమాదానికి గురయిన ఘటన విశాఖపట్నం శివారులో చోటుచేసుకుంది. అయితే గ్యాస్ సిలిండర్ల లీకేజీ, పేలుడు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. భారీగా గ్యాస్ సిలిండర్లు రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ ప్రమాదమేమీ జరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

విశాఖపట్నం శివారులోని అగనంపూడి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. లంకెలపాలెం నుంచి అగనంపూడి వైపు వెళుతున్న గ్యాస్ సిలిండర్ల లారీ జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా వెనకనుండి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తాపడి గ్యాస్ సిలిండర్లు రోడ్డుపై పడిపోయినా ఎటువంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుపై అడ్డంగా లారీ బోల్తాపడటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగింది. దీంతో గ్యాస్ ఎజన్సీ సిలిండర్లను మరోలారీలో అక్కడినుండి తరలించగా లారీని భారీ క్రేన్ సాయంతో పక్కకు జరిపారు.