Asianet News TeluguAsianet News Telugu

నా మీద కక్షతోనే నలంద కిశోర్ అరెస్ట్ .. గంటా శ్రీనివాసరావు

ఈ రోజు తెల్లవారు జామున అరెస్టైన నలంద కిశోర్ ను పరామర్శించడానికి  విశాఖ సిఐడి రీజినల్ కార్యాలయానకి వచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 

ఈ రోజు తెల్లవారు జామున అరెస్టైన నలంద కిశోర్ ను పరామర్శించడానికి  విశాఖ సిఐడి రీజినల్ కార్యాలయానకి వచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో మాజీమంత్రి గంటా శ్రీనివాస్ అనుచరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 70 ఏళ్ల వ‌య‌సున్న కిషోర్ ను మంగళవారం తెల్ల‌వారుఝామున విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌లప్రతిష్టను దెబ్బతీసేలా ఒక కథనాన్ని సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేసిన కేసులో నలంద కిషోర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది.