విజయవాడ కేంద్రంగా సంకల్పసిద్ది స్కామ్... డిజిపికి ఎమ్మెల్యే వంశీ ఫిర్యాదు

విజయవాడ : సంకల్ప సిద్ది మార్ట్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుండి వందలకోట్లు వసూలుచేసి మోసానికి పాల్పడ్డారు కొందరు దుండగులు.

First Published Dec 2, 2022, 11:04 AM IST | Last Updated Dec 2, 2022, 11:04 AM IST

విజయవాడ : సంకల్ప సిద్ది మార్ట్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుండి వందలకోట్లు వసూలుచేసి మోసానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆకర్షణీయమైన స్కీములతో ఏపీ, తెలంగాణలోని డిపాజిటర్లను నుండి  దాదాపు రూ.170 కోట్ల వరకు వసూలు చేసి గత పదిహేను రోజులుగా విత్ డ్రాలు నిలిపివేసారు. దీంతో ఈ భారీ స్కామ్ గురించి బయటపడింది. అయితే విజయవాడ కేంద్రంగా జరిగిన ఈ సంకల్పసిద్ది కుంభకోణం వెనక వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని, టిడిపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రమేయం వుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే వంశీ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఏపీ డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేసారు. డిజిపిని కలిసిన అనంతరం వంశీ మాట్లాడాతూ... సంకల్ప సిద్ది కేసులో వస్తున్న నిరాదార ఆరోపణల నేపథ్యంలోనే డిజిపిని కలిసినట్లు తెలిపారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సామాన్య ప్రజలను మోసం చేసిన సంకల్ప సిద్ది కేసులో నిజా నిజాలను విచారణ చేయించాలని డీజీపీని కోరానన్నారు. తనపై ఆరోపణలు చేసిన టిడిపి నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం, కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు  బచ్చుల అర్జునుడికి చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరారు ఎమ్మెల్యే వంశీ.