రెండు వాహనాలు, 56 బస్తాలు, 1700కిలోలు, ఒక్కడే స్మగ్లర్... ఏపీలో భారీ గంజాయి ముఠా గుట్టురట్టు

అల్లూరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

First Published Aug 21, 2022, 12:30 PM IST | Last Updated Aug 21, 2022, 12:30 PM IST

అల్లూరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పాడేరు ఏజెన్సీ చింతపల్లి ప్రాంతంలోని అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ బొలేరో, మరో జీప్ ను పట్టుకున్నారు. వీటిలో తరలిస్తున్న బస్తాలకు పరిశీలించగా అందులో గంజాయిని గుర్తించారు. రెండు వాహనాల్లో 56బస్తాల గంజాయి (సుమారు 1700కిలోలు) గంజాయి వున్నట్లుగా నిర్దారించిన పోలీసులు వెంటనే రెండు వాహనాలను సీజ్ చేసారు. ఈ గంజాయి విలువ 50లక్షల రూపాయల వరకు వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీసుల తనిఖీలను గుర్తించిన ఎనిమిదిమంది స్మగ్లర్లు పరారయ్యారు. ఒక్కడిని మాత్రం పోలీసులు పట్టుకున్నాడు. స్వాధీనం చేసుకున్న గంజాయిని, సీజ్ చేసిన వాహనాలను,  నిందితుడిని పోలీసులు మీడియాముందు ప్రవేశపెట్టారు. ఈ గంజాయి స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని... పరారయిన స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.