పోలీసుల నుండి తప్పించుకోబోయి... ఈ గంజాయి స్మగ్లర్లు ఎంత ఘోర ప్రమాదానికి గురయ్యారో చూడండి (సిసి టివి వీడియో)
సేమ్ టు సేమ్ ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రమాదం మాదిరిగానే చెక్ పోస్ట్ గేట్ తగిలి బైక్ వెనకాల వ్యక్తి కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డ సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం: పోలీసుల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన గంజాయి స్మగర్లు ప్రమాదానికి గురయ్యారు. మితిమీరిన వేగంతో వెళుతున్న స్మగ్లర్ల బైక్ చెక్ పోస్ట్ గేటును ఢీకొట్టింది. దీంతో సేమ్ టు సేమ్ ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రమాదం మాదిరిగా వెనకాల వున్న వ్యక్తి కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే డ్రైవింగ్ చేస్తున్న స్మగ్లర్ మాత్రం బైక్ ను అలాగే పోనిస్తూ తప్పించుకున్నాడు.
వెంటనే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని గాయపడిన వ్యక్తి వద్ద గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని ఎస్.కోట ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద దృశ్యాలు మొత్తం సీసీటీవీలో నమోదయ్యాయి.